
తేదీ :12/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట మండలంలో ఉన్నటువంటి సిద్ధార్థ కళాశాల విద్యార్థిని ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొత్తం మార్కులు వేయి కి గాను యంపిసి గ్రూపులో తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించి కళాశాలలోనే ద్వితీయ విద్యార్థినిగా పేరు తెచ్చుకున్న ఘనత గొప్ప విశేషం. విద్యార్థిని తల్లిదండ్రులు కష్టపడి క్రమశిక్షణతో చదివించడం వలన అదేవిధంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించడం వలన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నేను కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినందుకు ఇన్ని మార్కులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు మరియు , కళాశాల యాజమాన్యం అధ్యాపకుల బృందం వారి స్నేహితులు అభినందనలు తెలపడం జరిగింది. పై చదువులు కోసం కూటమి ప్రభుత్వమే సహాయ సహకారాలు అందించాలని వారు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
