ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్
Trinethram News : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ తగిలింది.కేతిరెడ్డి భూఆక్రమణల పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చెరువుభూములు కబ్జా చేశాడని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో చెరువు భూముల్లో నుంచి ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. లేనిచో ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 5న నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం 20 ఎకరాలు కేతిరెడ్డి కబ్జాకు పాల్పడ్డారని నోటీసుల్లో పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App