
Trinethram News : సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ట్రయల్స్ పూర్తయ్యాయని, మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమన్నారు…
