TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 17 :నెల్లూరు జిల్లా: కావలి.:కావలి పట్టణంలో సంచలనం కలిగించిన సుమారు 200 కోట్ల రూపాయలు ప్రజల చేత షేర్ మార్కెట్ ట్రేడింగ్ వ్యాపారం ముసుగులో కట్టించుకొని మోసం చేసిన మనీ స్కీం మోసగాళ్లు (ఏ. వన్) ముద్దాయి షేక్.మహబూబ్ సుభాని, (ఏ. టు)ముద్దాయి యలసిరి బ్రహ్మానందం లను అరెస్టు చేసినట్లు డి.ఎస్.పి శ్రీధర్ తెలిపారు. సోమవారం కావలి పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి శ్రీధర్, రూరల్ సీ.ఐ. జి.రాజేశ్వరరావు,ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్,రెండవ పట్టణ సిఐ గిరిబాబు తన సిబ్బందితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ కావలి మండలం లోని గౌరవరం దగ్గర ఎన్ హెచ్ 16 సమీపన లారీ పార్కు వద్ద 16వ తేదీ రాత్రి ఏ వన్ ముద్దాయి షేక్ మహబూబ్ సుభాని,ఏ టు ముద్దాయి యలసిరి బ్రహ్మానందం లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మనీ స్కిన్ బ్యాంకు ఖాతాలలో ఉన్న 5,35,92,126 రూపాయలను సీజ్ చేసినట్లు చెప్పారు.5,74,51,00 రూపాయల ఆస్తులను గుర్తించామని తెలిపారు.28,48,600 రూపాయలను గుర్తించామని తెలిపారు.మనీ స్కీం నిర్వాహకుడు ప్రధాన ముద్దాయి షేక్ మహబూబ్ సుభాని బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన వారని తెలిపారు.ఆన్ లైన్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ ముసుగులో ప్రజలను మభ్యపెట్టి మొదట కాకినాడలో వ్యాపారం ప్రారంభించి కోట్ల రూపాయలు ప్రజల చేత ఏజెంట్ల ద్వారా కట్టించుకొని పారిపోయారని తెలిపారు.కాకినాడ పోలీస్ స్టేషన్లో ఒక చీటింగ్ కేసు సుభానిపై నమోదు అయిందని తెలిపారు.

తరువాత తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో షేర్ మార్కెట్ ట్రేడింగ్ వ్యాపారం ముసుగులో కోట్ల రూపాయలు ప్రజల చేత ఏజెంట్ల ద్వారా కట్టించుకొని పారిపోయారని తెలిపారు.మక్తల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయి ఉన్నాయని తెలిపారు.పోలీసుల కంట పడకుండా తప్పించుకుని తిరుగుతూ ఎక్కడ అరెస్టు కాకుండా 2021 నవంబర్లో కావలికి వచ్చి ముసునూరు ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని తన చీటింగ్ మనీ స్కీమ్ వ్యాపారం ప్రారంభించారని తెలిపారు.

తన మాటల గారడీ తో ఏజెంట్లను తయారు చేసుకుని ప్రజల చేత కోట్ల రూపాయలు కట్టించుకుని మరో రెండు నెలలలో పారిపోదామని ప్రయత్నం చేశారని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేయకుండా షేర్లు కొంటున్నట్లు అమ్ముతున్నట్లు నమ్మించి ప్రజలను మోసం చేశారని తెలిపారు.ఈ కేసును కేవలం 12 రోజులలో సుమారు 12 కోట్ల రూపాయలను రికవరీ చేసి ప్రధాన ముద్దాయిలను అరెస్టు చేసి కేసు గుట్టు రట్టు చేసిన రూరల్ సీఐ జి.రాజేశ్వరరావును ప్రత్యేకంగా డీఎస్పీ శ్రీధర్ అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Share market