TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్​ కు బ్రాండ్​ గా ఉన్న చార్మినార్​ వద్ద పెనుప్రమాదం తప్పింది. గురువారం ( ఏప్రిల్​ 3) న నగరంలో పడిన భారీ వర్షానికి భాగ్యలక్ష్మి ఆలయం వైపున మినార్​ నుంచి పెచ్చులూడి పడ్డాయి.

దీంతో పర్యాటకులు భయాందోళనకు గురై.. పరుగులు తీశారు. గతంలో రిపేర్​ చేసిన మినార్​ నుంచి పెచ్చులూడిపడినట్లు నిర్దారణ అయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను తీసి వేసి అక్కడ క్లీన్ చేశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మినార్‌కు మరోమారు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్ లో ఇవాళ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం ( ఏప్రిల్​ 3) మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shards blown off Charminar