డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్
Trinethram News : ఆంధ్రప్రదేశ్ ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు 50% రాయితీతో షేడ్నెట్స్ అందిస్తామని చెప్పారు. ఒక్కో షెడ్ వ్యయం ₹3.22Lకాగా సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని స్త్రీనిధి, బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పారు. జాతీయ జీవనోపాధుల పథకం కింద రాష్ట్రానికి ₹1,000Cr కేంద్ర నిధులు పొందనున్నట్లు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App