
సిఐటియు వి. ఉమామహేశ్వరరావు.
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 22: సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం మాడగడ పంచాయతీ నందిగూడ లో పర్యటించి సిపిఎం జిల్లా, కార్యదర్శి సభ్యులు వి ఉమామహేశ్వరరావు, మండల నాయకులు సింహాద్రి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆరు గ్రామాలకు కేంద్రంగా ఉన్న నందిగూడ గ్రామంలో సబ్ సెంటర్ ఏర్పాటుచేసి రోగులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అనారోగ్యం వచ్చిన గర్భిణీలు చెకప్ కోసం మాడగడ గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో మంచి సౌకర్యం తీవ్రంగా ఉందని తెలిపారు.
రైతు భరోసా సక్రంగా రైతులకు రావడంలేదని సిపిఎం నాయకులు ముందు రైతులు తెలియజేశారు. నూతనంగా పెళ్లయిన వారికి రేషన్ కార్డు రావాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అడగటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. గిరిజన సాంప్రదాయ వివాహాలు జరుగుతాయని అందువలన సర్టిఫికెట్లు నిబంధనలను మినహింపు ఇవ్వాలని తెలిపారు. గ్రామంలో రోడ్డు డ్రైనేజీ వంటి సమస్యలు వెంటాడుతున్నాయని తెలిపారు నాడు నీడలో మంజూరైన స్కూల్ భవనం అసంపూర్తిగా ఉండిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
