TRINETHRAM NEWS

అమరావతి
• తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

• వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు,టీడీపీ క్రిస్టియన్ విభాగ నేతలు

• ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాయుడు

• ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతుందన్న పలువురు మత పెద్దలు

• మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తారు అంటూ దీవెనలు

• సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు ప్రసంగం:-
• మానవ ప్రయత్నానికి…దేవుని అశీస్సులు కావాలి. అప్పుడే సంకల్పం నెరవేరుతుంది.
• ఈ రోజు పవిత్రమైన మేరీమాత దేవాలయానికి వెళ్లడం నా అదృష్టంగా భావిస్తున్నా
• సమస్త మానవాళి రక్షణ కోసం దేవుడు ఏసు మానవ రూపంలో వచ్చారు.
• ప్రభుత్వం తరుపున సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించే విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో నేను మొదలు పెట్టాను. నేను సిఎంగా ఉన్న సమయంలో మొదటి సారి సెమీ క్రిస్మస్ విధానాన్ని తీసుకువచ్చాను.
• నేను ఈ రోజు మేరీమాత దేవాలయంలో బైబిల్ చదివాను. ఏ వ్యాఖ్య చూసినా సమాజ హితం కోసమే బోధనలు ఉన్నాయి.
• శత్రువును కూడా ప్రేమించాలి అని బైబిల్ చెపుతోంది. కానీ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి నేడు ఉంది.
• క్రిస్టియానిటీకి అంటేనే సేవ. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు పెట్టి క్రిస్టియన్ మిషనరీలు సేవ చేస్తున్నాయి.
• గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ లో అన్న ఎన్టీఆర్ చదువుకున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులు ఎయిడెడ్ పనులు సంస్థలు చేశాయి.
• ఎయిడెడ్ సంస్థలకు గత ప్రభుత్వాలు గ్రాంట్ ఇచ్చి ప్రోత్సహించాయి. కానీ నేడు ఆ ఆస్తులుకొట్టేసే ప్రయత్నం జరుగుతోంది
• ఏడు లక్షల కోట్ల ఎయిడెడ్ ఆస్తుల కోసం కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు.
• ఇది తప్పు అని చెపితే వారిపై కేసులు పెడుతున్నారు.
• గుంటూరు నగరం అనగానే శంకర్ విలాస్ హోటల్ గుర్తు వస్తుంది. రంగనాయకమ్మ అనే ఆమె ఆ హోటల్ పెట్టింది. ఆమె ఎల్ జి పాలిమర్స్ ప్రమాదంపై చిన్న ట్వీట్ పెట్టింది.
• తన అభిప్రాయం చెప్పినందుకు వృద్దురాలు అయిన ఆమెపై కేసు పెట్టారు. ఆమెను బెదిరించారు. అనేక తప్పుడు కేసులు పెట్టి హోటల్ మూయించారు.
• దీంతో ఆమె వేరే బిజినెస్ మొదలు పెడితే దాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇక్కడ బతకలేం అని హైదరాబాద్ వెళ్లిపోయింది.
• ఇలాంటి ఘటనలు చూసినప్పుడు బాధ కలుగుతుంది. ప్రజలంతా వీటి గురించి ఆలోచించాలి.
• సెమీ క్రిస్మస్ లాంటి కార్యక్రమం చేసుకోవడమే కాదు…ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడాలి. ఖండించాలి
• పార్టీలు దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. దీనిపై కేసు పెడితే కనీసం స్పందించలేదు.
• రాష్ట్రంలో గంజాయి విపరీతంగా ఉంది అని ప్రశ్నించినందుకు వచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు.
• రాజకీయ పార్టీలపైనే ఇలాంటి దాడులు చేస్తే…ప్రజా సమస్యలపై ఎవరు మాట్లాడుతారు.
• రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ భ్రష్టు పట్టాయి. రోడ్లు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం.
• సమాజ హితం కోసం పనిచేయమని ఏసుప్రభువు కూడా చెప్పారు.
• ఎన్నికలకు ఇంకా 100 రోజులు మాత్రమే ఉంది. ప్రజలు అంతా ఆలోచించాలి.
• మనం గళం ఎత్తకపోతే శంకర్ విలాస్ రంగనాయకమ్మ లా అయిపోతాం.
• రంగానాయకమ్మ అని పేరు ఉన్నందుకు ఆమె పేరు లో కూడా కులం చూశారు. నేను ఎప్పుడూ కులం, మతం అనేది చూడలేదు.
• హైదరాబాద్ లో ఐటీని అభివృద్ది చేస్తే…ఒక్క కులమే అభివృద్ది చెందిందా? నేను ఒక్క కులం కోసం అభివృద్ది చేశానా?
• హైదరాబాద్ లో నేను మొదలు పెట్టిన అభివృద్దిని నాటి వైఎస్ఆర్ నుంచి నేటి రేవంత్ వరకు కొనసాగించారు
• కానీ మన ఎపిలో మాత్రం అమరావతిని నాశనం చేశారు. మూడు రాజధానులు అంటూ విధ్వంసం చేశారు.
• గుంటూరు చర్చికి నేను పది కోట్లు ఇస్తే దాన్ని పూర్తి చెయ్యలేదు. కానీ విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టి నేను పేదల బిడ్డను అంటున్నాడు.
• అన్నీ చేసి పైన దేవుడు ఉన్నాడు…కింద నేను ఉన్నాను…. మీ బిడ్డను అంటున్నాడు
• ఎవరూ దేశంలో, లోకంలో శాశ్వతంగా ఉండరు. కానీ సమాజం శాశ్వతం. సమాజం కోసం పనిచేయాలి.
• క్రైస్తవులు జెరూసలేంకు వెళ్లేందుకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం
• గుంటూరులో రెండు ఎకరాల్లో క్రిస్టియన్ భవనం నిర్మాణానికి రూ. 10 కోట్లు ఇచ్చాం. మరో 6 కోట్లు కూడా కేటాయించాం.
• విజయవాడ చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం.శ్మశాన వాటికలకు భూమి కావాలి అంటే…ప్రత్యేక భూసేకరణ కార్యక్రమం చేపట్టాం.
• క్రిస్మస్ రోజు పేదలు కూడా పండుగ చేసుకోవాలి అని క్రిస్మస్ కానుకలు ఇచ్చాం.
• చర్చ్ ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేశాం.
• దేశంలో పేదరికం లేని సమాజం చూడాలనేది నా ఆకాంక్ష. దాని కోసమే నేను పనిచేస్తాం.
• దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాము. గతంలో టీడీపీ హయాంలో తీసుకువచ్చిన ఈ విధానాన్ని కొనసాగించాలి.
• జెరూసలేం వెళ్లే వారికి 50 శాతం ఖర్చు ప్రభుత్వాలు భరించాలి అని కోరుతున్నారు. దీన్ని అధికారంలోకి వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం
• రాష్ట్రానికి మంచి జరగాలి అని చర్చిల్లో ప్రార్థనలు చేయండి