
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గత పాలకుల అసమర్థ నిర్ణయాల వల్ల వేసవి కాలం రాకముందే రామగుండం నియోజకవర్గంలోని గోదావరి నదిలో నీరు లేక దాదాపుగా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడిన తరుణంలో ఈరోజు మధ్యాహ్నం రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి సంస్థ సహకారంతో గోదావరి నదిలో ప్రోక్లైన్ ను స్వయంగా నడిపి ఇసుక మేటలు తోడి పనులను ప్రారంభించి సంబంధిత అధికారులకు అవసరమగు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు
ఎమ్మెల్యే తో పాటు సింగరేణి సంస్థ ఆర్జి-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, తాజా మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
