TRINETHRAM NEWS

మహిళలకు స్వయం ఉపాధి

శిక్షణ కోర్సులు, శిక్షకుల నుండి దరఖాస్తుల కు, ఆహ్వానం.
వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కోర్సులకు, కోర్సుల సంబంధించిన శిక్షకులు నుండి దరఖాస్తులు కోరడం జరుగుతుంది అని. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్, లయన్. డాక్టర్ సురభి శ్రీధర్ తెలిపారు.వెలుగు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్సుల్లో టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్, మగ్గం వర్క్ కోర్సులను అనుభవజ్ఞులైన శిక్షకులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని. ఈ కోర్సులు 45 రోజులు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. కోర్సుల అనంతరం కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్స్ ను, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ద్వారా అందించడం జరుగుతుంది అని, కోర్సులు నేర్చుకోవాలని ఆసక్తిగల మహిళలు, తమ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, 2 ఫొటోస్, స్టడీ సర్టిఫికేట్ తో 8977748838, నెంబర్ ను సంప్రదించగలరు అని తెలిపారు.

పైన పేర్కొన్న కోర్సులో శిక్షణ ఇవ్వడానికి అనుభవజ్ఞులైన శిక్షకులనుండి దరఖాస్తులు కోరుచున్నాము అని, ఆసక్తిగల శిక్షకులు తమ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, 2 ఫొటోస్, స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్, శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్ లతో సంప్రదించాలని. కోర్సులో శిక్షణ ఇస్తున్న శిక్షకులకు తమ సంస్థ ద్వారా గౌరవ వేతనం తో పాటు శిక్షకులకు సర్టిఫికెట్ అందించడం జరుగుతుంది అని తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App