గ్రామసభల ద్వారా పథకాలకు తుది అర్హుల జాబితా ఎంపిక
*పాలకుర్తి మండలం జిడి నగర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్
పాలకుర్తి , జనవరి -18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గ్రామ సభల ఆమోదం తోనే ప్రభుత్వం చేపట్టబోయే 4 కార్యక్రమాలకు తుది అర్హుల జాబితాను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ కోయ
శ్రీ హర్ష పాలకుర్తి మండలం జీడి నగర్ గ్రామంలో జరుగుతున్న రేషన్ కార్డ్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సర్వే త్వరగా పూర్తి చేసి గ్రామ సభలలో రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, వంటి పథకాల అర్హుల జాబితా వివరాలను ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
గ్రామసభల ఆమోదం తోనే తుది అర్హుల జాబితా రూపొందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాలలో వ్యవసాయ యోగ్యం కాని భూములను మాత్రమే రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ కింద 20 రోజులు పని చేసి ఎటువంటి భూమి లేని రైతు కూలీల కుటుంబాలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత పేదలకు అవకాశం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ స్థితిగతులను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ జ్యోతి, ఎంపిడిఓ పూర్ణ చందర్ రావు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App