
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్. సి. యల్ పట్టణము నందుగల శ్రీ చైతన్య పాఠశాలలో సైన్సు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి గా ఆర్.ఎఫ్.సి.యల్, సి.జి.యం ఉదయ్ రాజాన్షా చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థుల్లో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయని -ఉపాధ్యాయులు వారిలో దాగి ఉన్న మేధస్సును, సృజనాత్మకతను వెలికితీసే విధంగా వారి ప్రతిభను గుర్తించి భవిష్యత్తుకు బంగారుబాట వేయాలని చెప్పారు.
కార్యక్రమాన్ని -ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ రవి ఇలాంటి వేడుకలు నిర్వహించటం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికి వస్తాయని, భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలకు ఇవి ఎంతగానో దోహదపడతాయి అన్నారు. అనంతరం “క్యాట్” పరీక్షలో అద్భుతమైన ప్రతిభకనబరచిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఆర్.ఎఫ్.సి.యల్ సంస్థ అధికారులు ఎస్. ఎన్. సాహు, రమేష్ ఠాకూర్, డీన్ రమేష్, ‘సి’బ్యాచ్ బాధ్యులు, ప్రశాంతి, ఎ.ఓ. నరేంద్ర కుమార్, స్రవంతి అధ్యాపకబృందం, విద్యార్థులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
