జూలై 16, 2026

WhatsApp Image 2025 01 29 at 17.47.05

TRINETHRAM NEWS

ఎస్సీ/ఎస్టీ 2ఇంక్లైన్ నూతన కమిటీ ఎన్నిక

ఫిట్ సెక్రటరీగా చీరాల రాజేష్..! ఫిట్ కమిటినీ గని మేనేజర్ కు పరిచయం చేసిన ఎస్సి/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఎస్సీ , ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/ 1982 ఆర్జీ వన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జనగామ నర్సయ్య ఆధ్వర్యంలో 2ఇంక్లైన్ లో జరిగిన సమావేశంలో గని ఫిట్ కమిటి, ఫిట్ సెక్రటరీగా చీరాల సురేష్ నీ ఎన్నుకున్నారు. నూతన ఫిట్ కమిటీని బుధవారం గని మేనేజర్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ జనగామ నర్సయ్య మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ కార్మికుల పక్షాన వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారానికి నిరంతరం కమిటీ పాటుపడుతుందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి మేనేజర్ ఫిట్ కమిటీకి సహకరించాలని కోరారు.

అలాగే అసోసియేషన్ ఏర్పడి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సింగరేణి ఏరియాలలో ఎక్కడ లేని విధంగా ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఏర్పాటు చేసుకున్నామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మించిన శిలాఫలకంపై జరిగిన అచ్చు తప్పును సరి చేసుకుంటామని అందువల్ల జరిగిన ఇబ్బందికి అసోసియేషన్ పక్షాన చింతిస్తున్నామని పెద్దలు పెద్ద మనసుతో క్షమించాలని మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా కార్మికుల హక్కులు సంక్షేమం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ గంగారపు లింగమూర్తి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల కృష్ణ, డిప్యూటీ సెక్రటరీ ఆరెపల్లి రామచందర్, దాట్ల ఉమేందర్, కాటం సురేష్ బాబు, రమేష్, శ్రీకాంత్, నరేష్ నాయక్, జవహర్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page