TRINETHRAM NEWS

తాడేపల్లి

తాడేపల్లి మండల గౌడ సంఘం,రామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులపోటీలు,డ్యాన్స్ పోటీలు

మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్
పరిధిలోని తాడేపల్లి గౌడ కమ్యూనిటీ హాల్లో ఆదివారం సాయంత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేపల్లి మండల గౌడ
సంఘం,రామ్ హాస్పిటల్ అధినేత, డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ల ఆధ్వర్యంలో
సంక్రాంతి ముగ్గుల పోటీలు డాన్స్ పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో ఈ పోటీలలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని
ముగ్గులు వేసి డాన్స్ పోటీలలో పాల్గొన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి మండల గౌడ సేవా సమితి నాయకులు మాట్లాడుతూ ఆచార, వ్యవహారాల సమ్మేళనాల్లో భాగమైన పండుగలే మనుషులకూ, సమాజానికి మధ్య అనుబంధాల వారధులు.డబ్బే ప్రధానం కాకుండా, వ్యవసాయం, రైతు, ప్రకృతి సమన్వయం చేసుకునే పలు వృత్తుల అనుసంధానం కూడా వీటిలో భాగమే. భిన్నత్వంలోని ఏకత్వానికి అద్దం పడుతూ ఆయా కాలాలు, ప్రాంతాలు ప్రజల ఆచార సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తాయి. కలిసి మెలిసి బతికేలా తరతరాల బంధాలకు అర్థం చెబుతూ ఊళ్లకు ఊళ్లు సందోహంగా కదిలే సాంస్కృతిక సంబరానికి ఆనవాళ్లే సంక్రాంతి సంబరాలని అన్నారు.కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునేది ఈ పెద్ద పండుగని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం ముఖ్య సలహాదారు జోగి నాగేశ్వరరావు, రాష్ట్ర గౌడ సంఘం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వాకా రామ్ గోపాల్, గౌడ సంఘం నాయకులు కంచర్ల కాశయ్య, లచ్చి తులసీదాస్,
పలగాని శ్రీకాంత్,సువర్ణ కంటి
రాజ శేఖర్,రేఖా బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.