TRINETHRAM NEWS

Sagar 22 gates were lifted by the officials

Trinethram News : నాగార్జునసాగర్‌ కు కృష్ణమ్మ పోటెత్తింది, ఎగువ రాష్ట్రాల లోకురుస్తున్న భారీ వర్షాల తో సాగర్ నిండుకుండల మారింది.ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది.

దీంతో అధికారులు 22 గేట్లను 5ఫీట్ల మేరకు ఎత్తి అధికారులు నీటిని పులిచింతలకు, దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 3,00, 995 క్యూసెక్కుల వరద వస్తున్నది. అతే మొత్తం కిందికి వెళ్తున్నది.

క్రస్ట్‌ గేట్ల ద్వారా 2,55,296 క్యూసె క్కులు, ఎడమ కాలువ ద్వారా 7601 క్యూసెక్కులు, కుడి కాలువకు 7878, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 28,420 క్యూసెక్కులు, ఏఎమ్మార్‌ ప్రాజెక్టుకు 1800 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుకాగా, ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.50 టీఎంసీలు. ఇప్పుడు 298.30 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

సాగర్‌ నుంచి భారీగా వరద దిగువకు వెళ్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు క్రమం గా నిండుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ఇప్పుడు 142.71 అడుగులుగా ఉన్నది.

45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికిగాను 10.65 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టుకు 74,443 క్యూసె క్కుల వరద వస్తుండగా, 25,676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sagar 22 gates were lifted by the officials