
బీసీ రిజర్వేషన్ల పెంపు పై స్పష్టత లేని అధికార,ప్రతిపక్ష పార్టీలు
బీసీ ముస్లింలను మినహాయించి తీర్మానం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం
కుల సర్వే లో ముస్లిం బీసీలు హిందూ బీసీలు అంటూ ఎలా విభజిస్తారు..?
ఎండి షబ్బీర్
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబ్బీర్ మీడియాతో మాట్లాడుతూ
తెలంగాణలో బీసీ కూలగణన మరియు విద్య,ఉద్యోగ,రాజకీయ ల్లో రిజర్వేషన్ల పెంపు పై అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు స్పష్టత లేకుండా ప్రకటనలు ఇస్తున్నారు
తెలంగాణ లో జరిగిన కుల గణన ద్వారా ఎవరెంత ఉన్నది స్పష్టం అయినందున బీసీ ల లెక్కలు తేలాయి కానీ బీసీలను కూడా హిందూ బీసీ లు ముస్లిం బీసీలు అని మతపరంగా విభజించడం బాధాకరం
మతరాజకీయాలు చేసే వారు బీసీ లలో ముస్లిం బీసీ లను మినహాయించాలని అంటున్నారు ఇలాంటి ప్రకటనలు బీసీలను మత ప్రాతిపదికన విభజించాలనే కుట్రలు చేస్తున్నారు
కాబట్టి బీసీలు 56% ఉన్నందున బిల్లు పెడితే 56% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పెట్టాలి
ప్రతిపక్ష పార్టీలు , బీసీ కుల సంఘాలు కూడా బీసీ ముస్లింల ను కూడా పరిగణనలోకి తీసుకుని ఉద్యమించాలి
ఎన్నికలు రాగానే మైనారిటీ గళం ఎత్తుకోవడం జరుగుతుంది తప్ప చిత్తశుద్ధితో కృషి జరగడం లేదు
మైనారిటీల రిజర్వేషన్ల విషయానికి రాగానే విభజన రాజకీయాలు చేసి వాటిని మతపరంగా విభజించడం తో అవి అమలుకు నోచుకోవడం లేదు
రాహుల్ గాందీ జస్కి జిత్ని సజేదారి ఉస్కి ఉత్ని భాగ్యధారి ఎవరెంతో వారికి అంత అంటూన్నారు
తెలంగాణలో బీసీ కులాలు 56% అని తెలపకుండా హిందూ బీసీ లు ముస్లిం బీసీలు అంటూ విభజించడం బాధాకరం ఉద్దేశ్య పూర్వకంగానే అమలుకు అడ్డకులకు అవకాశం కల్పించినట్లే ఇలా మతాల ద్వారా విభజించి పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు
కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ల పెంపును హామీ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు
బీసీ రిజర్వేషన్ల పెంపు పై అసెంబ్లీలో 56% రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చెయ్యాలి
10% ముస్లిం బీసీ లను మినహాయించాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
