TRINETHRAM NEWS

Trinethram News : రౌండ్ టేబుల్ సమావేశం బాపట్లఎన్జీవో హోం లో జన విజ్ఞాన వేదిక – కే.జీ.బేసిన్ గ్యాస్ – పోరాట కమిటీ, రైతు సంఘం, ఇతర ప్రజా సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

మంగళవారం జరిగింది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోటా వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన, డాక్టర్ కొల్లా రాజమోహన్ కే. జి. బేసిన్ గ్యాస్ పోరాట కమిటీ – రాష్ట్ర కన్వీనర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఇటీవలే కే.జీ.బేసిన్ (కృష్ణ గోదావరి – బేసిన్ ) బంగాళాఖాతం సమీపంలో ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ఆంధ్రుల సొత్తు – రాజ్యాంగ హక్కు అన్నారు. 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 50% కే.జీ. బేసిన్ నిక్షేప లాభాలు ఆంధ్రులకు చెందాలి ఈ విషయమై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం పెరగాలి అన్నారు. కోట వెంకటేశ్వర రెడ్డి (JVV ) మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చాలి,కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ప్రజల్లో చర్చ పెరగాలన్నారు. ఇటీవలే కేజీ బేసిన్ ముడిచమురు గ్యాస్ నిక్షేపాల నుండి ఉత్పత్తిని ప్రారంభించడం కేంద్ర ప్రధాని మోదీ, పెట్రోలియం శాఖామంత్రి హరిదీప్ సింగ్ హర్షం వ్యక్తం చేయడం విధితమే, మన రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు ఈ విషయంపై మాట్లాడాలి, రానున్న ఎన్నికలు అందుకు సరైన సమయం అని పెద్ద స్థాయిలో మరో సదస్సు జరపాలని నిర్ణయించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారు (వివిధ సంఘాలు) గోరంట్ల శాంతారామ్ విశ్రాంత అధ్యాపకులు ఆర్ట్స్ కాలేజ్, డాక్టర్ పి సి. సాయిబాబు ఫారం ఫర్ బెటర్ బాపట్ల, కరణం రవీంద్రబాబు హేతువాద సంఘం, తోట. రామాంజనేయులు అడ్వకేట్, జీవి. వెంకటేశ్వర్లు, బి. తిరుమలరెడ్డి సిఐటియు కార్యదర్శి, డివి.రమణయ్య, రైతు సంఘం, ఆసోది శంకర్, సుభానితదితరులు పాల్గొన్నారు.