TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం- పరిగి ఎమ్మెల్యే TRR చౌడాపూర్ మండలంలో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పర్యటించారు. మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.అనంతరం మరికల్ గ్రామంలోని రైతు వేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 10,01,160/- రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే TRR అందించారు.
చౌడపూర్ మండలం మల్కాపూర్ నుండి కామారం వరకు 1కోటి 25 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. మల్కాపూర్ గ్రామంలో 10లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బంగ్రంపల్లి గేట్ నుంచి మల్కాపూర్ 2కోట్ల 25 లక్షల వ్యయంతో బీటీ రోడ్డును నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
బంగ్రంపల్లి గ్రామంలో 5లక్షల వ్యయంతో CC రోడ్డును నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరికల్ గ్రామంలో 20లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన,10లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన,4లక్షల వ్యయంతో SC మాల కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన,6లక్షల వ్యయంతో యాదవ కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.*
కిష్టంపల్లి గ్రామంలో 10లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన* కిష్టంపల్లి గ్రామం నుండి కిష్టంపల్లి తండా వరకు 63 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Roads are a priority