ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( హుకుంపేటమండలం ) జిల్లాఇంచార్జ్ :
శ్రీ మత్స్య లింగేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి.
అల్లూరి జిల్లా, హుకుంపేటమండలం, మఠం పంచాయతీ లోని, ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం, మత్స్య గుండం స్వయంభూ శ్రీ మత్స్య లింగేశ్వర స్వామి వారిని గురువారం పాడేరు ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నాలుగు కోట్ల, ఏబై లక్షల రూపాయల తో మఠం జంక్షన్ నుండి మత్స్య గుండం వరకు విస్తరణ చేస్తున్న రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత గా చేపట్టాలని పలు సూచనలు చేసారు, ఈ కార్యక్రమం లో పంచాయతీ సర్పంచ్ శాంత కుమారి, ఆలయ కమిటీ సభ్యులు మత్స్య కొండ బాబు,గోపాల పాత్రుడు,ఏం రామ్ బాబు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App