Road condition from Annavaram Bridge to Korukonda
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ అల్లూరిజిల్లా ఇంచార్జ్ :
అల్లూరిజిల్లా, చింతపల్లి మండలం, అన్నవరం బ్రిడ్జి నుండి, కోరుకొండ గ్రామం వరకు సుమారు పద్దెనిమిది కీ.మీ ఉంటుంది. అన్నవరం బ్రిడ్జి నుండి , ఏడు కీ. మీ దారిపొడవునా “నిమ్మపాడు” గ్రామం వరకు వెళ్లే రోడ్ మార్గం, ప్రస్తుతం తుఫాన్ కారణంగా, మరియు ప్రతీ రోజు ఇరవై హెవీ లోడ్ వేకిల్స్ వరకు , తిరగటంవల్ల రోడ్ చాలా మరమత్తులకు గురి అవి, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఎర్పడింది. కొన్ని సందర్భాల్లో “గర్భిణీ స్త్రీలకు” ఆంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లడం కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్లే వాళ్ళం అని, ప్రయాణికులు మీడియా ముందు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కావున త్వర, త్వరగా మా రోడ్డు పనులు పూర్తి చేసి తమకు సౌకర్యవంతమైన, ప్రయాణాన్ని కల్పిస్తారని, పై అధికారులకు ప్రయాణికులు వేడుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App