
కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్నికల ప్రచారానికి వెలుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు ఈరోజు మధ్యా హ్నం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు
మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు, ప్రయాణిస్తున్న కారు జగిత్యాల జిల్లా కోరుట్ల సాయిబాబా గుడి వద్ద లారీ ఢీకొట్టింది
ప్రమాదంలో యాదగిరి శేఖర్ రావుకు స్వల్ప గాయాలవ్వగా వెంటనే అనుచరులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. నిజామాబాద్‌లో ప్రచారం ముగించుకొని కరీంనగర్ వైపు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది
ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం అందవలసి ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
