
Trinethram News : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణు ప్రియను పోలీసులు దాదాపు పది గంటలకుపైగా విచారించారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కూడా విచారణ చేశారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న రీతూ చౌదరి కూడా విచారణకు హాజరైంది. ఆమెను దాదాపు ఐదు గంటలకుపైగా విచారించారు పోలీసులు. మార్చి 25న విచారణకు రావాలని పోలీసులు వాళ్లిద్దరికీ సమాచారం అందించారు.
ముందుగా వాళ్లఫోన్లు సీజ్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశంపై ప్రశ్నలు సంధించారు. ఈ విచారణలో రీతూ చౌదరి విష్ణు ప్రియను బుక్ చేసినట్టును తెలుస్తోంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయం తనకు విష్ణుప్రియే చెప్పినట్టు రీతూ అంగీకరించింది. అసలు ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా వీడియోలు చేయాలో కూడా ఆమె ట్రైనింగ్ ఇచ్చినట్టు పోలీసులకు వివరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
