TRINETHRAM NEWS

వారం రోజుల్లో రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలి అదనపు కలెక్టర్ డి.వేణు

కరీంనగర్ ఉమ్మడి జిల్లా పెద్దపల్లి, ఫిబ్రవరి 07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి ధాన్యం కేటాయింపులకు బ్యాంకు గ్యారంటీ లను వారం రోజులలో సమర్పించాలని అదనపు కలెక్టర్ డి.వేణు రైస్ మిల్లర్లను ఆదేశించారు శుక్రవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కేటాయింపు బ్యాంకు గ్యారంటీ సమర్పణ పై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ, 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి ధాన్యం కేటాయింపు కోసం 125 మంది రైస్ మిల్లర్లలో 15 మంది మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించడం జరిగిందని, మిగిలిన రైస్ మిల్లర్లు వారం రోజులు బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు
బ్యాంకు గ్యారంటీల జారీ అంశంలో వివిధ బ్యాంకులలో ఆలస్యం అవుతుందని రైస్ మిల్లర్లు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా బ్యాంకు గ్యారంటీల జారీ విషయంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా చూడాలని కలెక్టర్ లీడ్ బ్యాంకు మేనేజర్ ను ఆదేశించారు బ్యాంకు గ్యారంటీ జారీ అంశంలో బ్యాంకుల నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే లేడు బ్యాంక్ మేనేజర్ దృష్టికి వెంటనే తీసుకుని వెళ్లాలని అదనపు కలెక్టర్ రైస్ మిల్లర్లకు సూచించారు
ప్రభుత్వ ఆదేశాలు మేరకు వారం రోజుల గడువు లోగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించిన బ్యాంకు గ్యారంటీ లను ప్రతి రైస్ మిల్లర్ తప్పనిసరిగా సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు
ఈ సమావేశంలో డీఎస్ఓ రాజేందర్, బియ్యం సివిల్ సప్లై శ్రీకాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rice millers