BRS పార్టీ భవన్‌కు రెవెన్యూశాఖ నోటీసులు
తెలంగాణభవన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది.
పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ BRS భవన్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించింది.
2011 నుంచి టీ న్యూస్ ఛానల్‌ను BRS భవన్‌లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది.