సిఎల్ఆర్ విద్యా సంస్థలలో… గణతంత్ర దినోత్సవ వేడుకలు
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం
కంభం పట్టణంలోని సిఎల్ఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష మాట్లాడుతూ భారతదేశ పాలనకు దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగంను ఆమోదించిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్సిసి విద్యార్థులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి ఎల్ ఆర్ జూనియర్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, కళాశాల అధ్యాపక బృందం భూపతి నారాయణ గుండాల ముక్తేశ్వరరావు ఏనుగుల రవికుమార్, షేక్ షరీఫ్,డేవిడ్, ముతకపల్లి శ్రీనివాసరెడ్డి,పాలిసెట్టి నవీన్, పివి ఆంజనేయులు,ఉప్పు నారాయణ, కైతg రాజేశ్వరి, బి అరుణ, వి వనజ, కే.బ్యుల , ఇమ్మానియేల్, టాబ్రేజ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App