TRINETHRAM NEWS

ప్రధాన రోడ్డు మార్గాల్లో ఆక్రమణలను తొలగించండి

  • కమిషనర్ వికాస్ మర్మత్,ఐ.ఏ.యస్.,

నగర పాలక సంస్థ పరిధిలోని ప్రధాన రోడ్డు మార్గాల్లో ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. స్థానిక కె.వి.ఆర్ పెట్రోల్ స్టేషన్ కూడలి నుంచి గ్రాండ్ ట్రంక్ రోడ్డులోని కరెంట్ ఆఫీసు కూడలి, వేదాయపాలెం, అయ్యప్పగుడి, నేషనల్ హై వే వరకు కమిషనర్ గురువారం పరిశీలించారు. రోడ్లను అక్రమిస్తున్న తాత్కాలిక దుకాణాలు, నిర్మాణాలను వెంటనే తొలగించాలని, భవన నిర్మాణాల సామగ్రి రోడ్లపై లేకుండా యజమానులను హెచ్చరించాలని ఆదేశించారు. రోడ్లపై పశువుల సంచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, డివైడర్లపై పచ్చదనాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగకుండా, వ్యర్ధాలు పేరుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
.