
Trinethram News : చందోలు గ్రామంలో వేంచేసి వున్నశ్రీ బగళాముఖీ అమ్మవారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ, కమలాపురం శాసనసభ్యులు అయిన శ్రీ పోచం రెడ్డి రవీంద్ర రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో వేద పండితుల ఆశీర్వచనాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అపురూపమైనటువంటి అత్యంత శక్తివంతమైన ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించడం తనకెంతో సంతోషంగా ఉన్నదని చాలా అదృష్టంగా భావిస్తున్నానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారినికోరుకున్నానని తెలియపరిచారు ఈ సందర్భంగా ఆ దంపతులకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు మోదుగుల ప్రభాకర్ రెడ్డి ఆలయ కార్య నిర్వహణ అధికారి జి నరసింహమూర్తి నూతన వస్త్రాలతో సత్కరించారు వారి వెంట పెందుర్తి శివరామ ప్రసాదు, సాయి కార్తీక్, సాయి స్వప్న అనుసరించారు
