TRINETHRAM NEWS

ఆరు గ్యారంటీల అభయహస్తం తోపాటు రేషన్ కార్డు దరఖాస్తులు
ముందుగా అందించాలి
విధివిధానాలు స్పష్టం గా ప్రకటించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు

ఆరు గ్యారంటీల అభయహస్తం తోపాటు రేషన్ కార్డు ధరఖాస్తులు ఇంటి ఇంటికి ముందు గా ప్రభుత్వం అవసరమైన మేరకు అందించాలని, విధివిధానాలు స్పష్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ డిమాండ్ చేశారు.
గురువారం వైరా మున్సిపాలిటీ పరిధిలో ఒకటవ వార్డు లో జరిగిన ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ను సిపిఎం బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా బొంతు రాంబాబు, సుంకర సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అభయహస్తం విధివిధానాలు స్పష్టం చేయకుండా దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం చేయడం వల్ల గందరగోళం నెలకొంది అని అన్నారు, ఆరు గ్యారంటీల అభయహస్తం దరఖాస్తులు తోపాటు రేషన్ కార్డు ధరఖాస్తులు ప్రభుత్వం ముందుగా ప్రజలకు అందించాలని కోరారు, ముఖ్యమంత్రి ప్రకటన, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రకటించిన అంశాలు మధ్య తేడా ఉంది అని ఒకరు రైతు భరోసా కి కూడా దరఖాస్తు చేయాలంటే మంత్రి అవసరం లేదు అంటూ ప్రకటనలు తో ప్రజలు గందరగోళం అవుతున్నారని అన్నారు, ఆధార్ కార్డు తెలంగాణ ఉండాలనే ప్రచారం తో మీ సేవ కేంద్రాల వద్ద వేలాది మంది ప్రజలు తెల్లవారుజామున సమయం నుండి పడిగాపులు పడుతున్నారు అని అన్నారు, గ్యాసు కనెక్షన్ పురుషులు పేరు ఉంటే మహిళలు పేరు మార్చుకొనే దుకు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు అందుకే ప్రభుత్వం ఆరు గ్యారంటీల అభయహస్తం విధివిధానాలు బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు , మున్సిపాలిటీ పరిధిలో ఒకటవ వార్డు లో అధికారులు ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేశారు స్థానిక అధికారులు కృషి అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నూకల వెంకటేశ్వరరావు, బైరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు