TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయెధ్య రామమందిరంలో మొదటిసారి హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం హోలీ పండగను పురస్కరించుకొని భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.
సోమవారం భక్తులు పెద్దఎత్తున రామ్‌లల్లాను దర్శించుకున్నారు. హనుమాన్‌గర్హి ఆలయంలోని దేవుని విగ్రహానికి రంగులు చల్లడంతో ఈ వేడుక ప్రారంభమైంది. భక్తులు భక్తిగీతాలు ఆలపిస్తూ రంగులు చల్లుకుంటూ ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మాట్లాడుతూ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఎలాగైతే వేల సంఖ్యలో భక్తులు రాముడిని దర్శించుకున్నారో, అలాంటి కోలాహలం నేడూ నెలకొంది. అయోధ్యకు బాలరాముడు రావడంతో ఈ సంవత్సరం హోలీ వేడుకలు మరింత సంబరంగా జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల కోసం ఆలయ ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లుచేసిందని తెలిపారు.