TRINETHRAM NEWS

రామగుండంలో చిమ్మ చీకట్లను పారద్రోలేందుకు కృషి చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి వెల్లడి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధానమైన రహదారులలో వీధి లైట్లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్పందించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్ ఎఫ్ సి ఎల్ కంపెనీ యాజమాన్యాన్ని వీధిలైట్లు కావాలని కోరగా ఈరోజు ఉదయం ఆర్ ఎఫ్ సి ఎల్ కంపెనీ సీజీఎం ఉదయ్ రాజ్ హన్స, హెచ్ఆర్ అధికారి ఉదయ్ గార్లు దాదాపుగా 11 లక్షల 55 వేల విలువగల 340 వీధిలైట్లను (90వాట్స్) స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు మున్సిపల్ అధికారులకు అందజేయడం జరిగింది..

ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, గడచిన పదేళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పక్కనపెట్టి కేవలం దందాలకు దోపిడీలకు అరాచకాలకు మాత్రమే పని చేస్తూ పరిపాలన చేయడం వల్ల విజ్ఞులైన రామగుండం ప్రజలు వారిని చిత్తుచిత్తుగా ఓడించడమే కాక,
దాదాపుగా గత 30 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన శక్తి మేర ప్రజా అవసరాలను తీరుస్తూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కేవలం రాజ్ ఠాకూర్ తోనే సాధ్యమని నమ్మి భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది..
గెలిచిన నాటినుండి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజా పాలన కొనసాగిస్తూ ప్రజా అవసరాలకై పాటుపడుతూ,
ఇక్కడి స్థానిక పరిశ్రమల డిఎంఎఫ్టి సిఎస్ఆర్ తదితర నిధులను వారి బాధ్యతగా నియోజకవర్గానికి అందించాలని, అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పదేపదే వారికి సూచించగా
గతంలో ఆర్ ఎఫ్ సి ఎల్ కంపెనీ యాజమాన్యం దాదాపుగా 5 లక్షల విలువచేసే వీధిలైట్లను అందించడంతోపాటు ఈరోజు దాదాపుగా 11 లక్షల 55వేల రూపాయల విలువగల 340 వీధిలైట్లను అందించి ఈ ప్రాంత అభివృద్ధికి వారు సహకరిస్తున్న తీరుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు,
గడిచిన 10 ఏళ్లలో రామగుండం అభివృద్ధికై ఇక్కడి పరిశ్రమల సహకారం, భాగస్వామ్యం తీసుకురావడంలో విఫలమైన బీఆర్ఎస్ నాయకులు నేడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ పై,
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పలుచన చేయడానికి కొన్ని తప్పుడు అనాలోచిత, అజ్ఞానపు, అనవసరపు మాటలు మాట్లాడుతున్న తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని,
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్ము వేసినట్టేనని, ఇకనైనా బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ప్రజలే వారిని ఎక్కడికక్కడ నిలదీసి జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరిస్తారని, ఇకనైనా వారు పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించడంతోపాటు,
ఎన్టిపిసి ఏ టైప్ గేట్ నుండి గౌతమ్ నగర్ సెంటర్ వరకు వీధిలైట్లు లేక ఎంతోమంది ప్రమాదాలకు గురై చనిపోయిన సంఘటనలు కూడా అనేకం, అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేలా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యంతో చర్చించి,
ఆ పనులు త్వరగా జరిగేలా ఆదేశాలు ఇవ్వగా, పనులు ప్రారంభమై పిల్లర్ల వరకు పూర్తి అయ్యాయని అతి త్వరలోనే పూర్తిస్థాయిలో పనులు జరిగి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు జరుగుతుందని, అభివృద్ధిపై తప్పుడు విమర్శలు చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు ఒకసారి అక్కడికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను చూడాలని వారికి సూచించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు మహిళా విభాగం నాయకురాలు మరియు ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు మున్సిపల్ అధికారులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App