TRINETHRAM NEWS

రికార్డ్ వేగం తో 18 నెలల్లోనే రామాయపట్నం పోర్ట్ ‘రెడీ’

నెలాఖరుకు తొలి నౌకను తీసుకువచ్చేందుకు ప్రణాళిక

నెల్లూరు జిల్లాలో సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ 2022 జూన్‌లో భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.

రాష్ట్రంలోని 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ ఉండేలా అడుగులు

20 వేల కోట్లతో ఒకేసారి 4 పోర్టులతో పాటు 10 మినీ పోర్టుల తరహాలో ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను అభివృద్ధి చేస్తోంది జగన్ ప్రభుత్వం

ప్రస్తుతం విశాఖలో మేజర్‌ పోర్టుతో పాటు మరో 5 నాన్‌ మేజర్‌ పోర్టులు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్‌వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ కాపిటివ్‌ పోర్టులున్నాయి.

ఇవి కాకుండా ఇంకో 4 పోర్టులను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.

రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను రాష్ట్ర ల్యాండ్‌ లార్డ్‌ మోడల్‌లో అభివృద్ధి చేస్తుండగా, కాకినాడ గేట్‌వే పోర్టును పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు

ఇందులో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.

రూ.91.18 కోట్లతో చేపట్టిన కాకినాడ యాంకరేజ్‌ పోర్టు ఆధునికీకరణ పనులు పూర్తి కానుండటంతో పోర్టు సామర్థ్యం పెరగనుంది.

రామాయపట్నంలో బల్క్‌ బెర్త్‌ పనులు దాదాపు పూర్తి కావడంతో ఈనెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు మారిటైమ్‌ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఈ ఏడాది చివరి నాటికి కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

2025 నాటికి రాష్ట్రంలో మొత్తం పది పోర్టులు అందుబాటులోకి రానున్నాయి.