సెప్టెంబర్ 29, 2026
TRINETHRAM NEWS
Ramavath Ravindra Kumar

–నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు మోసం.

-దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

Ramavath Ravindra Kumar : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 07, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో సోమవారం బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీ ఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. డిండి ప్రాజెక్టును కె ఎల్ ఐ ద్వారా నింపి, డిండి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
కే ఎల్ ఐ ద్వారా డిండి ప్రాజెక్టును నింపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి రైతుల పొలాలకు నీరు అందించిందని తెలిపారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం డిండి ప్రాజెక్టు, ఆయకట్టు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డిండి ప్రాజెక్టును కే ఎల్ ఐ ద్వారా వెంటనే నింపి, ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టును కే ఎల్ ఐ ద్వారా నింపే వరకు, డిండి ఆయకట్టు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, పి ఎ సీ ఎస్ చైర్మన్లు పల్లా ప్రవీణ్ రెడ్డి,మాధవరం శ్రీనివాస్ రావు,సర్పంచులు మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,కృష్ణయ్య, పట్టణ అధ్యక్షులు గిరమోని శ్రీను, బలుముల తిరుపతయ్య, రషీద్, రామావత్ వెంకట్రామ్, తండు వెంకటయ్య,బొడ్డుపల్లి జయంత్, తండు చంద్రయ్య, సుంకరి చంద్రయ్య, ఓర్సు ముత్యాలు , నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page