TRINETHRAM NEWS

Ramakrishnapur Police Station visited CP

బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది అనే నమ్మకం, భరోసా కల్పించాలి పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్.,

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ పూర్ పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ల విజిట్ లో భాగంగా ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీస్ స్టేషన్ సిసిసి పిటిషన్ ల వాటి రికార్డ్ లను తనిఖీ చేశారు.

సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, మిస్సింగ్ మరియు క్రైమ్ కేసులలో ఆధారాలు సేకరణ, ఫిర్యాదులు అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ఓపి ప్రకారం విచారణ, ఆధారాలను, సాక్ష్యాలను సేకరించడం ప్రధానమైన సాక్షులతో వెంటనే మాట్లాడి వివరాలు సేకరించాలి అని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, రాబోయే పండుగల సమయంలో బందోబస్తు ఏర్పాటు, కాలనీ, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ కేడి లు, డిసి లు, సస్పెక్ట్ షీట్స్ ల ఇళ్లను, పాయింట్ బుక్స్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.

సీపీ పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్ లతో మర్యాదగా మాట్లాడాలి ప్రవర్తించాలి అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. బ్లూ క్లోట్స్ సిబ్బంది డయాల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి వారు సంఘటన స్థలంకి త్వరగా చేరుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ , స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి , ఎస్ఐ రాజశేఖర్ ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramakrishnapur Police Station visited CP