TRINETHRAM NEWS

Ramagundam Police Commissionerate

సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వార శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు బాధ్యతగా కృషి చేయాలి

బాధితుల పిర్యాదులకు వెంటనే స్పందించాలి, సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలి: పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోనీ డీసీపీ, ఏసీపీ లు, సీఐ, పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ అధికారులతో కమీషనరెట్ లో UI కేసులు, గ్రేవ్ UI లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం, SC/ST UI కేసులు, విమెన్ ఎగైనెస్ట్ కేసులు, POCSO కేసుల పరిష్కారం, NDPS యాక్ట్ కేసుల, NHRC, SHRC మరియు మహిళా కమిషన్‌కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,
(ఐజి) సమీక్షా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ప్రతి సిడి ఫైల్ ను, అందులో ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని, పెండింగ్ ఉన్న సిసి నెంబర్లు తీసుకోవాలన్నారు. ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సిడి ఫైల్ పొందుపరచాలని, నేర చేదన కంటే, నేర నివారణ చాలా ముఖ్యమని తెలిపారు.

సమన్స్, వారంట్స్ ఎగ్సిక్యూటివ్ చేయాలని, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ప్రోయాక్టివ్ పోలీసింగ్ పై అధికారులు సిబ్బంది దృష్టిసారించాలని సూచించారు.

బాధతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల పిటిషన్ లకు వెంటనే స్పందించాలి. సామన్య ప్రజలకు చట్టపరిధిలో ఏవిధంగా న్యాయం చేయగలమో అలోచించి దానికి తగ్గట్లుగానే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని వారికీ నమ్మకం , భరోసా కలిగించాలి. పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి దరఖాస్తును ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ రిపోర్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.

పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Ramagundam Police Commissionerate

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం చాలా ముఖ్యం అని అన్నారు. పాయింట్ బుక్స్ చెక్ చేయాలి ,KD,DC,సస్పెక్ట్ షీట్స్ ఉన్న ఇండ్లను చెక్ చేయాలి. రిసెప్షన్, ఎస్.హెచ్.ఒ, కమ్యూనిటి పోలిసింగ్ ఇలా పోలీసు స్టేషన్ కి సంబందించిన అన్ని విభాగాల ఫంక్షనల్ వర్టికల్స్ గురించి వారి యొక్క పనితీరు గురించి అడిగి తెలుసుకొని నిరంతరం ఎస్ఐ పర్యవేక్షణ చేయాలన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలతో మంచి సత్ససంబందాలు కలిగి ఉండాలి అప్పుడు సమాచారం వ్యవస్థ పటిష్టం గా ఉంటుంది. ఏదైనా నేరం జరిగినప్పుడు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కారా మార్గం తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరు తాము చేసే విధులపై పూర్తి అవగాహన కలిగి యుండాలి అని అధికారులకు సూచించారు.

ఏదైనా సంఘటన జరిగినప్పుడు వేంటనే ఘటన స్థలంకి వెంటనే వెళ్ళాలి. పరిస్థితి లు అదుపులో ఉండేలాగా చూడాలి.

ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో సమావేశం ఏర్పాటు చేయాలి. కోర్టులో ట్రయిల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు నిందితులకు శిక్ష పడేలా నేర సంఘటన లో జరిగిన నిజం చెప్పే లాగా సాక్షులను మోటివేట్ చేయాలని సూచించారు.

జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్), ప్రమాదాలకు గల కారణాలను గుర్తించాలి , వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ల్యాండ్ కేసులు, సివిల్ కేసులలో ఎస్ఓపి ప్రకారం పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి

చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు పాల్పడే వారిపై నిఘా ఉండాలి ప్రతి 15 రోజులకు ఒకసారి పిలిపించి మాట్లాడాలి

G2/ సిసిసి పిటిషన్లు పెండింగ్ లేకుండా త్వరత గతికన పూర్తి చేయాలి.

పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణాకు పాల్పడుతున్న వారిపై నజరు పెట్టాలని, ముఖ్యంగా గంజాయితో పాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్మకాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ క్రింద నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.

సైబర్ నేరాల్లో ఫ్రిజ్ అయిన డబ్బులను త్వరగా బాధితులకు ఇప్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశం లో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, మంచిర్యాల జోన్ సీఐ లు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామచందర్ రావు, సిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మూత్తి లింగయ్య, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, NIB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, , ఆర్ఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam Police Commissionerate