TRINETHRAM NEWS

Trinethram News : Hyderabad : బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నాను

పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా

బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను

పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు నాకు బ్రోకరిజం చేయడం రాదు

గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వమని సూచిస్తే, నా సూచనలు పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీతో తిరిగే వ్యక్తికి ఇచ్చారు

ఎందుకు ఇలా చేశారు అని ఒక కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారు

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నాను, వెంటనే గోల్కొండ జిల్లా అధ్యక్షుడి పదవిని నేను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని రాజాసింగ్ వ్యాఖ్యానించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajasingh's sensational comments
Rajasingh’s sensational comments