
డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ, రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ సహకారంతో 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేత
Trinethram News : దంపూర్ : ఆసిఫాబాద్ నియోజకవర్గం, లింగాపూర్ మండలం లోని దంపూర్ వాస్తవ్యులు జాధవ్ అనుబాయి స్వర్గీయ రావుజీ నాయక్ దంపతుల కుమార్తె జాధవ్ రజితా వివాహానికి రెహమాన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆదివారం పెద్దన్నగా అండగా నిలిచింది. ఈ సందర్భంగా తండ్రిలేని ఆడబిడ్డ పెళ్లికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఫౌండేషన్ చైర్మన్ : డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ సహకారంతో ఆదివారం పెద్దల సమక్షంలో 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తండ్రిలేని పేద కుటుంబానికి అండగా నిలవాలనే మానవతా దృక్పధంతో ఈ సహాయాన్ని అందించడం జరిగిందనీ లింగాపూర్ మండలం రెహమాన్ ఫౌండేషన్ ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ అన్నారు. ఆడపిల్లలను భారంగా భావించవద్దన్నారు. కుటుంబ సభ్యులు చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ గారితో పాటు ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం జాధవ్ బలరాం నాయక్, జాధవ్ బాబులాల్, జాధవ్ చిరంజీవి (మాజీ సర్పంచ్), రాథోడ్ శ్రీకాంత్, జాధవ్ వెంకటేష్, రాథోడ్ దిలీప్, రాథోడ్ రాజు, రాథోడ్ శ్రీకర్, రాజేష్ గ్రామస్తులు, యువకులు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
