TRINETHRAM NEWS

కేయూలో ర్యాగింగ్ కలకలం.

78 మంది విద్యార్థులు సస్పెండ్.

వరంగల్ డిసెంబర్ 23:
వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలో ర్యాగింగ్‌ తీవ్ర కలకలం రేపింది.

జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు శుక్రవారం ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్ చేసిన వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మెుత్తం 78 మంది విద్యార్థినీ విద్యార్థులను వారంపాటు హాస్టల్స్‌ నుంచి సస్పెండ్‌ చేశారు.

వర్సిటీ చరిత్రలో ఇంతమంది విద్యార్థులను ఒకేసారి సస్పెండ్‌ చేయడం ఇదే మెుదటిసారి

పరిచయాల పేరుతో పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్న వర్సిటీ అధికారులు గుర్తించారు పద్మావతి మహిళా వసతి గృహంలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థినుల వివరాలు సేకరించారు.

ఇతర అన్ని విభాగాల్లోనూ ర్యాగింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించారు కామర్స్, ఎకనామిక్స్ జువాలజీ విభాగాల్లోని మొత్తం 78 మందిని గుర్తించి సస్పెండ్‌ చేశారు.

మిగతా విభాగాల్లోనూ ర్యాగింగ్‌ చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామని వర్సిటీ అధికారులు తెలిపారు సరైన ఆధారాలు లభిస్తే వారిని కూడా సస్పెండ్‌ చేస్తామన్నారు.

అన్ని వసతి గృహాలకు నేటి శనివారం నుంచి ఈ నెల 31 వరకు క్రిస్మస్‌ సెలవులు ప్రకటించినట్లు తెలిపారు విద్యార్థులు తక్షణమే వసతి గృహాలను ఖాళీ చేయాలని సూచించామని వర్సటీ అధికారులు.