ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసి గత పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని కాలనీని మరింత వేగవంతంగా అభివృధ్ధి చేయాలని కోరగా, మరికొందరు కాలనీలలో నెలకొని ఉన్న సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మట్లాడుతూ కాలనీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. అదేవిదంగా పలు కాలనీలలో పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఫోన్ ద్వారా అధికారులను అదేశించారు.