
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 26 :నెల్లూరు జిల్లా: కావలి. పట్టణంలోని వడ్డీ పాలెం కనకదుర్గ ఆలయం వద్ద షార్ట్ సర్క్యూట్ తో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పూరి ఇల్లు దగ్నమైంది. మధ్యాహ్నం ఆ ఇంటి కుటుంబ సభ్యులైన గుంజి వెంకటేశ్వర్లు, గుంజి కోటేశ్వరి దంపతులు శివాలయానికి వెళ్లి వచ్చేలోగా ఈ దారుణం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో 1,50,000 నగదు 15 సవర్ల బంగారం దగ్నమయ్యాయని గుంజి కోటేశ్వరి చుట్టుపక్కల వారు తెలిపారు. సమాచారం తెలియగానే ఆ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున వినిపిస్తున్నారు. అయితే అక్కడ స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం తెలిపిన ఫైర్ ఇంజన్ రిపేరు అయ్యిందంటూ ఉట్టి చేతులతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే వారికి సూచనలు ఇచ్చి వివరాలను రాసుకొని వెళ్లారు, ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
