TRINETHRAM NEWS

ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్లు

పెద్దపల్లి, అక్టోబర్-21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు.

సోమవారం అదనపు కలెక్టర్ లు జే.అరుణ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖలకు అదనపు కలెక్టర్ లు కేటాయించి ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి  ( 33 ) దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ లు తెలిపారు.

ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన దోడ్డె ఓదెలు సర్వే నెంబర్ 156 ఖాతా నెంబర్ 1001 లో 33 గుంటల వ్యవసాయ భూమి ప్రభుత్వం ద్వారా పొంది సాగు చేస్తున్నానని, ఇట్టి భూమిని 6 గుంటల మేర ఇతరులు ఆక్రమించారని సర్వేయర్ ద్వారా కొలతలు జరిపి హద్దులు నిర్ణయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఓదెలు మండల తహసిల్దార్ రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.

శ్రీరాంపూర్ మండలానికి చెందిన వేనిశెట్టి రమేష్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 167/ఏం/2 లోని తన పేరు మీద ఉన్న రెండు ఎకరాల 8 గుంటల భూమి ఇతరులకు అమ్మకుండా ఇనుగాల రాములు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కావున తనను వేధింపుల నుంచి రక్షించే ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తగు ఆదేశాలు ఇప్పించగలరని కోరుతూ దరఖాస్తు చేసుకోగా శ్రీరాంపూర్ తాసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

అంతర్గాం మండలం పొట్యాల గ్రామానికి చెందిన మల్లేష్ గత సంవత్సరం తన కూతురి వివాహం చేశానని, కళ్యాణ లక్ష్మి చెక్కు గురించి అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను అడిగితే నాకు రాదని చెబుతున్నారని, తాను అన్ని విధాల కళ్యాణ లక్ష్మి చెక్కు పొందేందుకు అర్హుడనని, తనకు చెక్కు వచ్చేలా చూడాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారిక రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ  సమావేశంలో  వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App