TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

ప్రజా ప్రణాళిక ఉద్యమం

బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్రంలో కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వులు మేరకు ప్రిన్సిపల్ కే.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రజా ప్రణాళిక ఉద్యమం 2023 పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక 2024 – 25 లో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి ప్రణాళిక, జిల్లా ప్రజా పరిషత్ అభివృద్ధి ప్రణాళిక ల సమగ్ర కార్యచరణ తయారీపై ఏడు జిల్లాలకు( ప్రకాశం, నెల్లూరు, కృష్ణ, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల) చెందిన జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్హణాధికారులు ZP CEO, deputy CEO లు, DPo ఓలు dlpo, dlco, dprc, రిసోర్స్ పర్సన్స్, ఎంపీడీవోలు మొత్తం 89 మంది వివిధ స్థాయి అధికారులకు శుక్ర, శనివారములు రెండు రోజులు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో చర్చించిన అంశములు : పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు, ఆవశ్యకత, వివిధ స్థాయిలలో అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా ప్రణాళిక ఉద్యమం లక్ష్యాలు, పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల కొరకు ఏర్పాట్లు, పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు – ఫంక్షనల్ స్టాండింగ్ కమిటీలు, గ్రామ సభలను విజయవంతంగా జరపడానికి తీసుకోవలసిన చర్యలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా దేయంగా (GP DP ) పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక తయారీ విధానం, e గ్రామ స్వరాజ్ పోర్టల్ లో పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అప్లోడ్ చేయటం తదితర అంశములపై శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రిన్సిపల్. శ్రీనివాస రెడ్డి ద్వారా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎం సుధాకర్ రావు( ఆన్లైన్) కేశవరెడ్డి జాయింట్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.