చీరాల పట్టణంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ నివాస స్థలాలు, ఇళ్లు లేక పోవడం వలన రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ప్రధాన వీధిలో ఉదయం తోపుడుబండ్లపై చిన్న చిన్న వస్తువులను అమ్ముకుంటూ రాత్రులు రోడ్ల మీదనే చంటి బిడ్డలతో ఎండలోను, చలిలోనూ, వానలోనూ నడివీధులలోనే జీవించవలసి వస్తుంది అని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందనలో నక్కల కులస్తులు మొరపెట్టుకున్నారు, సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అఖిలభారత గిరిజనుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా నివాస స్థలాలు లేక రోడ్ల మీదే నక్కల కులస్తులు 18 కుటుంబాలు జీవిస్తున్నారు. నివాసాలు లేకపోవడం వలన బిడ్డలను బడికి పంపించాలని ఉన్న పంపించలేకపోతున్నారు, వయసుకు వచ్చిన ఆడపిల్లలకు సైతం రక్షణ కరువైంది అన్నారు. చీరాల పట్టణంలో కుందేరు ప్రాంతంలో వీరికి ప్రభుత్వమే తాత్కాలిక నివాసాలు కల్పించినచో వారి జీవన ప్రమాణాలు మెరుగుదల అయ్యే అవకాశం ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమంలో
బి.వి.ఆర్.సి రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు
ఎస్సీ. ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు గూదే రాజారావు మాట్లాడుతూ 70 ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో నిలువ నీడ కల్పించమని నేటికి దళితులు గిరిజనులు విజ్ఞప్తి పెట్టుకోవాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. నక్కల కులస్తులు గత సంవత్సరం ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో కలెక్టర్ గారిని కలిసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అప్పటివరకు తాత్కాలిక వసతి అయిన కల్పించండి అని కోరి ఉన్నారని నేటికీ ఆ విధంగా అధికారులు చర్యలు చేపట్టకపోవడం విచారకరం అన్నారు. ఇప్పటికైనా నక్కల కులస్తులకు చీరాల పట్టణంలో తాత్కాలిక వసతిని ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిబిఆర్సి ఏరియా కో-ఆర్డినేటర్ వి. భగవాన్ దాస్ నక్కల కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.