
తేదీ: 26/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , వెలేరు రుపాడు మండలం, కటుకూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా కుక్కునూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది.
స్వామివారికి కానుకలు సమర్పించారు. గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రతి కుటుంబంలో కష్టనష్టాలు రాకుండా, ప్రతి ఒక్కరు వారు చేసే వృత్తులలో ధన లాభం చేకూరాలని, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండి ఉన్నాయని, పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రిని రంగ రంగ వైభవంగా జరపాలని
తెలిపారు.
సుమారుగా 40 వేల మంది భక్తులు వచ్చారని అంచనా. ప్రతి ఒక్కరికి మంచినీరు, భోజనం, మజ్జిగ , సదుపాయాలను కమిటీ వారు కల్పించడం జరిగింది. లోటుపాట్లు లేకుండా భక్తులను చూసుకున్నారు. కూటమీ ప్రభుత్వంపై భక్తులు ఆనందాన్ని వ్యక్త పరచడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
