TRINETHRAM NEWS

మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటం బహుకరణ

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ చిత్రపటం బహుకరణ మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గ నాయకుల తో కలసి డిండి మండల అధ్యక్షులు నారిమల మల్లేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ రాజు ప్రపంచ మేధావి నవభారత నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందించడం జరిగింది.
అనంతరం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఏ కుల రాజారావు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రజలందరికీ మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. మరియు రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరూ సమాజంలో వారి కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ప్రతి ఒక్కరు సమాజంలోని ప్రజలకు సేవ చేయాలని ఈ కార్యక్రమంలో మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు ఏ కుల సురేష్ మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మేడ సైదులు, డివిజన్ ఉపాధ్యక్షులు అవుట మల్లేష్, నూనె ప్రసన్నకుమార్, మాల మహానాడు దేవరకొండ మండల అధ్యక్షులు భక్తుల దినాకర్, డిండి మండల అధ్యక్షులు నారిమల మల్లేష్, మురళి గోరటి అంజి, అనిల్, గోరటి వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ambedkar's portrait
Ambedkar’s portrait