TRINETHRAM NEWS

సిద్ధమైన వైసీపీ సెకండ్ లిస్ట్…!

30 నియోజకవర్గాల్లో మార్పులు..

రోజా సేఫ్‌..! అంబటికి నో ఛేంజ్..!

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి.. తొలి విడతలో మంత్రులు సహా 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ అధిష్టానం..

ఇక, రెండో లిస్ట్‌పై కసరత్తు కొనసాగుతుండగా.. అది ఫైనల్‌ అయినట్టుగా ప్రచారం సాగుతోంది.. అయితే, మంత్రులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నేతలను రెండో జాబితా టెన్షన్‌ పెడుతోంది..

వైసీపీలో ఎలక్షన్ హీట్ కొనసాగుతుండగా.. నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పుపై కసరత్తు సాగుతోంది.. తొలి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు జరిగాయి.. మరో 10, 11 స్థానాలతో దాదాపుగా సెకెండ్ లిస్ట్ సిద్ధం అయ్యిందట..
ఇవాళ విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి…

రెండో జాబితా ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..

అయితే, గత కొంతకాలంగా మంత్రి రోజా స్థానం మారుస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. ఓ దశలో రోజాకు అసలు సీటు డౌటే అనే ప్రచారం సాగింది.. కానీ, నగరిలో మంత్రి ఆర్కే రోజా స్థానం సేఫ్ అని తెలుస్తోంది..

అంతే కాదు.. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం కూడా నో ఛేంజ్ అంటున్నారు. ఇక, దర్శి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ కు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

కానీ, ఎమ్మిగనూరు పై ఇంకా స్పష్టత రాలేదు.. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి ఉన్నారు.. ఇప్పటికే ఆయనకు 82 ఏళ్ళ వయస్సు రావటంతో పార్టీ హైకమాండ్ ప్రత్యామ్నాయం ఆలోచిస్తోందట …

ఎమ్మిగనూరు నుంచి బుట్ట రేణుక లేదా చెన్నకేశవ రెడ్డి ప్రతిపాదించే అభ్యర్థికి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక, మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ తానే పోటీ చేయబోనని ప్రకటించారు..

కానీ, ఎమ్మెల్యే వసంతను పిలిచి వైసీపీ అధిష్టానం బుజ్జగించిందట.. మరోసారి పోటీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసిందట.. దీంతో.. మరోసారి వసంత కృష్ణప్రసాద్ పోటీకి రెడీ అవుతున్నారట..

అయితే, రెండో జాబితాలో 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయనే చర్చ సాగుతుండగా.. ఫైనల్‌లిస్ట్‌ వస్తేగానీ.. ఆయా స్థానాల్లో నేతల టెన్షన్‌కు తెరపడేలా లేదు.