prepare 214 compliant everything in prajavani
214 లో కబ్జా బాగోతం
- కోట్ల విలువజేసే ప్రభుత్వ భూములు మాయం చేస్తున్న కేటుగాళ్ళు
- చర్యలు తీసుకోవటంలో విఫలమౌతున్న దుండిగల్ రెవెన్యూ అధికారులు
- జిల్లా కలెక్టర్ కల్పించుకోవాలంటున్న స్థానిక ప్రజలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండల పరిధిలో ఐస్ గడ్డల్లా కరిగిపోతున్న ప్రభుత్వం భూములు. స్థానిక చర్చి గాగిల్లాపూర్ సర్వే నంబర్ 214 లోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురౌతుంటే… నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న రెవిన్యూ అధికారులు సమాధానం చెప్పలేక విసిగిపోతున్నారు. ఇక్కడి ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి… వారికి కొమ్ము కాస్తున్నారా అనే అనుమానాలకి తావిస్తుంది .
గత కొద్ది రోజులుగా ఇక్కడి ఆక్రమణలపై వివరాలు తెలుసుకుని, ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో ‘త్రినేత్రం న్యూస్ ’ వార్త కథనాలు . ఇక్కడి రెవిన్యూ ఇన్స్పెక్టర్ మాత్రం మొదటి రోజు ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంటే… గోడలు మాత్రం కూల్చి, బేస్మెంట్ నిర్మాణాన్ని కూల్చకుండా వదిలేసి వచ్చారు. . ఒకవేళ ఇక్కడి ఏమ్మార్వో భూకబ్జాదారులతో కుమ్మక్కు కాకపోయి ఉంటే తక్షణమే చర్యలు చేపట్టేవారేమో … బంగారు తెలంగాణాలో ఎన్నో వందల వేల ఎకరాల ప్రభుత్వ భూమి తెలంగాణ రాష్ట్రంలో మాయమైపోయింది. తెలంగాణాలో ప్రభుత్వ భూములు మాయం కావటానికి ఇలాంటి కొందరు ‘విషయం తెలియని’ అధికారులు కూడా కారణమౌతారో ఏమో… అది కూడా చూడండి జిల్లా కలెక్టర్ గారు.
ఇలాంటి అధికారి ప్రజా సేవకుడు ఎలా అవుతాడు అంటూ మండి పడుతున్నారు విషయం తెలిసినవారు. ప్రభుత్వం భూమి అలాట్ అయిందని చెప్పుకుంటున్న ఓ అమాయకుడు, ఆ అమాయకుడిని అడ్డం పెట్టుకుని – ఓ అధికార పార్టీ నాయకుడి పేరు చెప్పుకుని ప్రభుత్వ భూమిని మింగే పనిలో నిమగ్నమైన కబ్జా దారులు ‘214 లో కబ్జా భాగోతం… చర్యలు తీసుకోవడంలో విఫలమౌతున్న స్థానిక రెవిన్యూ అధికారులు.
త్వరలో కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తాం అంటున్న కొందరు నాయకులు
జర్నలిస్ట్ యూనియన్ లీడర్ అంటూ కబ్జా దారులకు కాపు కాస్తున్న వ్యక్తులు ఏ విలేకరికి ఎంత ఇవ్వాలి అనేది అంత తనై దందా కబ్జాకోరులకి అండ ఇలాంటి చీడ పురుగులని ఏరి పారెయాలని కోరుతున్న విలేకర్లు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App