TRINETHRAM NEWS

ఖనిలో 18న ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లోని ఈనెల 18న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతిని పురస్కరించుకొని గోదావరిఖని లోని తెలుగుదేశం పార్టీ అనుబంధ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టి ఎన్ టి యు సి కార్యాలయంలో తెలుగు ప్రజల ఆశాజ్యోతి అన్న ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు.
ఈ మేరకు గురువారం టి ఎన్ టి ఎస్ సి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏడుకొండలు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మ బంధువు, ఆడపడుచులకు అన్న ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈనెల 18న గోదావరిఖనిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు అలాగే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తూ తెలుగు ప్రజల మదిలో నిలిచిన పార్టీని ఆదరించాలని, ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదులో ప్రజలు, అభిమానులు, రైతులు, కర్షకులు, కార్మికులు వివిధ సంఘటిత, అసంఘటిత కార్మికులు పాల్గొని సభ్యత్వం తీసుకోవాలని కోరారు.
ఈ సభ్యత్వం తీసుకోవడంతో వారికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యము కల్పిస్తున్నామని భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పొందడంలో అహర్నిశలు కృషి చేస్తున్న పార్టీని ఆదరించాలని సూచించారు సభ్యత్వ నమోదుకు మరొక 15 రోజులు పెంచినట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో చిటికెల రాజలింగం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి, గుండెబోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బెక్కం వీరేందర్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, నా రెడ్డి స్వరాజ్యం తెలుగుదేశం పార్టీ మహిళా మాజీ కార్యదర్శి, బరిగెల కళావతి రాష్ట్ర మహిళా మాజీ కార్యదర్శి, రామగిరి రాజేశ్వరి రాష్ట్ర టౌన్ మాజీ కార్యదర్శి, కామెర రాజబాబు ఎస్సీ సెల్ టౌన్ మాజీ అధ్యక్షుడు, సుందిళ్ల స్వామి టౌన్ ఎస్సీ సెల్ మాజీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App