
రామగుండం ప్రాంతాన్ని స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తా…
పాఠశాల విద్యార్థులతో ముందస్తు సంక్రాంతి వేడుకలు…
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తానని స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఈ మేరకు రామగుండంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు, అధ్యాపక బృందంతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు
ఈ సందర్భంగా పిల్లలతో ఆట పాట, గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నర కోట్ల వ్యయంతో స్కూలు అందమైన భవనంగా ఏర్పాటు చేస్తామని అన్నారు అదే క్రమంలో ఎప్పటికప్పుడు విద్యార్థుల సంఖ్య పెంచాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు
గతంలో ఈ స్కూల్‌లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం గొప్ప గొప్ప స్థాయిలలో ఉన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే అన్ని రకాల విద్యా అవకాశాలను కల్పించామన్నారు. మెడికల్ కాలేజీ తో పాటు నర్సింగ్, తదితర అదనపు కోర్సులను కూడా తీసుకువస్తున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా వ్యవసాయం చేసే రైతులకు, రైతు కూలీలకు శుభాకాంక్షలు తెలియజేశారు
పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న చెడును ప్రారదోలి మంచిని ఆస్వాదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ అజ్మీరా తో పాటు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీచర్స్, తల్లి దండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
