
Trinethram News : విజయవాడ పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పోతిన మహేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సమయంలో తన వెంట పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
