
శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్.ఐ సిహేచ్. చక్రపాణి, ఏఎస్ఐ రవీందర్ రావు -1659, జి. రవీందర్ కుమార్ – 1850, ఏ ఆర్ ఎస్ఐ లు కె. రాజయ్య, అహ్మద్ ఆలీ బేగ్, హెడ్ కానిస్టేబుల్ ఏ. రమేష్ -2389 లను పోలీస్ కమిషనర్ పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించడంతో పాటు, వారికి జ్ఞాపికలను అందజేసారు
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం క్లిష్టమైన పరిస్థితుల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రస్తుతం పదవీవిరమణ చేస్తున్న పోలీస్ అధికారులు వారి పదవీ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడంతో పాటు, కొన్ని సమయాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి వీరు భవిష్యత్తు తరం పోలీసులకు స్పూర్తిదాయకంగా నిలుస్తారని, ఉద్యోగవిరమణ చేసిన పోలీసు అధికారులు తమ ఆరోగ్యం కోసం నిరంతరం యోగ లేదా వ్యాయామాన్ని కొనసాగించడంతో పాటు, వారి కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించాలని శేష జీవితం కుటుంబ సభ్యులు పిల్లలతో హాయిగా ఆనందోత్సవాలతో జీవితం గడపాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు
ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ సి.
రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఓ శ్రీనివాస్, ఆర్‌ఐ దామోదర్, సూపర్డెంట్స్ మనోజ్ కుమార్, సంధ్య, ఆర్ఎస్ఐ కు రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచ లింగం పాటు పదవీవిరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
